Gayatri Suprabhatam meaning in Telugu
గాయత్రీ సుప్రభాతము
తాత్పర్యము
సర్వమంత్రాలకూ మూలభూతురాలు, వేదమాత, తేజోరూపురాలు, ద్విజులచేత ఆరాధించబడే గాయత్రీదేవి మమ్ములను రక్షించవలె.
1. విష్ణువూ, శివుడూ, బ్రహ్మా, సమస్త దేవతలూ, మహర్షులూ, సమస్తప్రాణులూ, లోకవినుతురాలైన గాయత్రికి సుప్రభాతం పలుకుతున్నారు.
2. గంగాది పవిత్ర నదీజలాల్లో పుష్పాంజలులతో జనులు గాయత్రీదేవికి అర్ఘ్యం ఈయనున్నారు.
3. ఋష్యాశ్రమ పరిసరాల్లోని వృక్షాల మీద ద్విజములూ, క్రింద ద్విజులూ , చెవులలో అమృత ni^pE^ta మధురంగా శ్రుతులు వల్లిస్తునారు.
4. గోవులు తమ దూడలను అమృతము వంటి పాలు త్రాగించి మహర్షుల ఆశ్రమభాగాల్నించీ మెలమెల్లగా అదవిలోకి పోతూ ఉన్నాయి.
5. మునులు మనోహరాలైన తమ ఆశ్రమాల ముందు కూర్చుని వేదవాఙ్మయంలోని ధర్మతత్త్వాన్ని శిష్యులకు బోధిస్తున్నారు.
6. చిలుకలు తామున్న చెట్ల క్ఱింద జరిగే వేదాధ్యయనం వింటూ తమ ఆహారానికై పండ్లకోసం పోవడం మరచి అక్కడే నిలచి ఉన్నాయి.
7. గాయత్రి మూర్తిత్రయస్వరూప. ఆమె తత్త్వం వేదత్రయం చేత తెలుస్తుంది. ఉదాత్తం, అనుదాత్తం, స్వరితం అనే మూడు స్వరాలతో స్పష్టం అయిన మంత్రరూపురాలు ఆమె. పరతత్త్వాన్ని బోధించే ఉపనిషత్తులు ఆమె రూపమే.
Comments
Post a Comment