Posts

Gayatri Suprabhatam meaning in Telugu

గాయత్రీ సుప్రభాతము తాత్పర్యము సర్వమంత్రాలకూ మూలభూతురాలు, వేదమాత, తేజోరూపురాలు, ద్విజులచేత ఆరాధించబడే గాయత్రీదేవి మమ్ములను రక్షించవలె. 1. విష్ణువూ, శివుడూ, బ్రహ్మా, సమస్త దేవతలూ, మహర్షులూ, సమస్తప్రాణులూ, లోకవినుతురాలైన గాయత్రికి సుప్రభాతం పలుకుతున్నారు. 2. గంగాది పవిత్ర నదీజలాల్లో పుష్పాంజలులతో జనులు గాయత్రీదేవికి అర్ఘ్యం ఈయనున్నారు. 3. ఋష్యాశ్రమ పరిసరాల్లోని వృక్షాల మీద ద్విజములూ, క్రింద ద్విజులూ , చెవులలో అమృత ni^pE^ta మధురంగా శ్రుతులు వల్లిస్తునారు. 4. గోవులు తమ దూడలను అమృతము వంటి పాలు త్రాగించి మహర్షుల ఆశ్రమభాగాల్నించీ మెలమెల్లగా అదవిలోకి పోతూ ఉన్నాయి. 5. మునులు మనోహరాలైన తమ ఆశ్రమాల ముందు కూర్చుని వేదవాఙ్మయంలోని ధర్మతత్త్వాన్ని శిష్యులకు బోధిస్తున్నారు. 6. చిలుకలు తామున్న చెట్ల క్ఱింద జరిగే వేదాధ్యయనం వింటూ తమ ఆహారానికై పండ్లకోసం పోవడం మరచి అక్కడే నిలచి ఉన్నాయి. 7. గాయత్రి మూర్తిత్రయస్వరూప. ఆమె తత్త్వం వేదత్రయం చేత తెలుస్తుంది. ఉదాత్తం, అనుదాత్తం, స్వరితం అనే

Baala Sarasvati Telugu verses

తెల్ల దనమంత చల్లని తల్లి గాగ బుజ్జి బంగారు తల్లి కబుర్ల పుట్ట తెలుపు లొలికెడి పూవుపొత్తిళ్ల మీద చదువు పుట్టంగ పుట్టె మా శారదమ్మ నిదురలో నవ్వి పాట వెన్నెలలు చిలికి చిట్టి గుప్పిళ్లఁ పాటల గుట్టు దాచి పాట మాటల పరుపుపై పాకిపాకి పాడ నొడిజేరఁ బుట్టె మా వాణి తల్లి నెత్తి పైకెక్కి ఎదదిగి మెత్తఁ దన్ని కదలి గురిచూచి పైపైకి గాలి నూది చిలిపిగా నాల్క నాడించి చెవులఁ గొట్టి రవ్వఁజేయ బుట్టెను మా సరస్వతమ్మ చిక్క దొకపట్టు నెవరికి జక్కనమ్మ చిక్కి నంతకె పులకలఁ జిలుకఁ జేయు నాట పాటల గుట్లన్ని యంది పుచ్చి పంచి యాడంగఁ బుట్టె మా భారతమ్మ మాకు నీవిచ్చు  నుడుల మాం మమ్ము పెట్టి పాల నీ పల్కుచిన్కులన్ లాల పోసి చేరి ని న్నెత్తుకొన నిమ్ము చేతు లిచ్చి రక్ష! రక్షమ్మ! బాల సరస్వతమ్మ  

Shiva tandava stotram Telugu

జటాటవీగలజ్జలప్రవాహపావితస్థలే గలేవలంబ్య లంబితాం భుజంగతుంగమాలికామ్ | డమడ్డమడ్డమడ్డమన్నినాదవడ్డమర్వయం చకార చండతాండవం తనోతు నః శివః శివమ్ || ౧ || జడల అడవి నుండి జారు నీటి   ఏరు సుద్ది జేయ మెడను పొడవు దండ లాగు నూగి తూగు నాగు తోడ     డండండమ డండండమ   డమరు సద్దు కడల నిండ   బెదురు బెట్టు చిందు వేయు శివుడు సిరుల నిడును గాత      (1) ------------------------------------------------------------ జటాకటాహసంభ్రమభ్రమన్నిలింపనిర్ఝరీ- - విలోలవీచివల్లరీవిరాజమానమూర్ధని | ధగద్ధగద్ధగజ్జ్వలల్లలాటపట్టపావకే కిశోరచంద్రశేఖరే రతిః ప్రతిక్షణం మమ || ౨ || జడల సుడుల మడుగు లోన సుడులు తిరుగ సురల యేరు పొంగి   పొరలు తరగ లల్లు తీగలతో   వెలుగు తలయు ధగ ధగ ధగ ధగ ధగ ధగ వెలుగు నుదుటి మంట తోటి తలపై నెలవంక తోటి   నన్ను నెపుడు లాగు చుండు   (2)   -------------------------------------------------------------- ధరాధరేంద్రనందినీవిలాసబంధుబంధుర స్ఫురద్దిగంతసంతతిప్రమోదమానమానసే | కృపాకటాక్షధోరణీనిరుద్ధదుర్ధరాపది క్వచిద్దిగంబరే మనో వినోదమేతు వస్తుని || ౩ || కొండల దొర కన్న బిడ్డ కులు

Srinatha ghusriNa with audio

Image

Dakshinamurty stotram English verse translation

Dakshinamurty stotram (Meditation on one’s own self as one’s guide) The idea in this poem is called Advaita Vedanta.  This poem can be seen as the concise version of the book Viveka Choodamani. Both Vivekachoodamani and Dakshinamurty Stotram are known to have been authored by Sri Shankaracharya who is known for bringing Vedanta in general and Advaita Vedanta in particular into light. Self -nonself distinction and the theory of 'All is self and Self is all' are the subject matter of both Vivekachoodamani and Dakshinamoorty Stotram.                                I The world is like a city seen inside a mirror; being there in own inside.    In self he sees as if projected out By Maya’s work as dream in sleep is seen When wakes he turns to see it face to face The in and out not two but one his self His Face to South the smiling one to that My guiding form I bow within me now.                                 II The world around is like a germ in seed