Baala Sarasvati Telugu verses
తెల్ల దనమంత
చల్లని తల్లి గాగ
బుజ్జి బంగారు
తల్లి కబుర్ల పుట్ట
తెలుపు లొలికెడి పూవుపొత్తిళ్ల
మీద
చదువు పుట్టంగ పుట్టె
మా శారదమ్మ
నిదురలో నవ్వి
పాట వెన్నెలలు చిలికి
చిట్టి గుప్పిళ్లఁ
పాటల గుట్టు దాచి
పాట మాటల పరుపుపై
పాకిపాకి
పాడ నొడిజేరఁ బుట్టె
మా వాణి తల్లి
నెత్తి పైకెక్కి ఎదదిగి
మెత్తఁ దన్ని
కదలి గురిచూచి
పైపైకి గాలి నూది
చిలిపిగా నాల్క
నాడించి చెవులఁ గొట్టి
రవ్వఁజేయ బుట్టెను
మా సరస్వతమ్మ
చిక్క దొకపట్టు
నెవరికి జక్కనమ్మ
చిక్కి నంతకె పులకలఁ
జిలుకఁ జేయు
నాట పాటల
గుట్లన్ని యంది పుచ్చి
పంచి యాడంగఁ బుట్టె
మా భారతమ్మ
మాకు
నీవిచ్చు నుడుల మాం మమ్ము పెట్టి
పాల నీ
పల్కుచిన్కులన్ లాల పోసి
చేరి ని న్నెత్తుకొన నిమ్ము చేతు లిచ్చి
రక్ష! రక్షమ్మ! బాల సరస్వతమ్మ
Just melted gold poured on a bed of white. That is how I feel, when I read these verses.
ReplyDelete