వినాయక కీర్తన
రాగం : నాట
పల్లవి: విద్యార్థుల సద్విజ్ఞత పెంచే
సిద్ధి వినాయక శ్రద్ధ నీయవా.
అనుపల్లవి: తొండము దంతము తోరపు బొజ్జయు
అచ్చము ఓమను అక్షరమ్మనగ
చరణం1: అమ్మకు అండౌ అల పిండిబొమ్మయె
అండ పిండ బ్రహ్మాండ మేలెనని
తలిదండ్రులకు ప్రదక్షిణ చేసిన
ఇల యంతయు నిక నేల చుట్టుటని //విద్యార్థుల//
చరణం2: గేలి చేయు టను కేళి చేసిన
ఎంత చందురుని ఎవరు కందురని
దోషము నొప్పుక మూషికమ్మయిన
పూజల నందుచు రాజిల్లునని //విద్యార్థుల//
Comments
Post a Comment