Posts

Showing posts from April, 2013

దక్షిణామూర్తి స్తోత్రము - తెలుగు అనువాదము

తెలుగు అనువాదము - Dr. పాతూరి నాగరాజు   దక్షిణామూర్తి స్తోత్రం - గురు తత్వం అనువాదం మూలం 1. వేరుగ నెంచకీ సకల విశ్వము నద్దములోని బొమ్మగా నారయు నెవ్వడెందు తన యెందున నుండగ మేల్కొనంగనే తోరపు ఈ జగంబెవడు తోచెను మాయననంగ నెంచు నా తీరగు దక్షిణాస్యశివు దేవుని నొజ్జను నేను గొల్చెదన్ 1. విశ్వందర్పణ దృశ్యమాన నగరీ తుల్యం నిజాంతర్గతం పశ్యన్నాత్మని మాయయా బహిరివోద్భూతం యథానిద్రయా యస్సాక్షాత్కురుతే ప్రభోధసమయే స్వాత్మానమే వాద్వయం తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే 2. అంకురమందుఁ గన్పడని యాకులుఁ గొమ్మలు చెట్టులో గనన్ పొంకము తోడ నిండువిధి పొంగును దేశము కాలమాదిగా నంకురమంత నుండి జగమంతయు మాయొ! యోగమో! శంకరు దక్షిణాస్యశివు సామిని నొజ్జను నేను గొల్చెదన్ 2. బీజస్యాంతరి వాంకురో జగదిదం ప్రాఙ్నిర్వికల్పం పునః మాయాకల్పిత దేశకాలకలనా వైచిత్ర్యచిత్రీకృతమ్ మాయావీవ విజృంభయత్యపి మహాయోగీవ యః స్వేచ్ఛయా తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే 3. ఉన్నది లేక యుండుటగ నుండున దెయ్యది యద్దిదోచు త- న్నెన్నగ ; వేదవాక్యముల నీవె యద...